ఉగాది కానుకగా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా విడుదల

ఉగాది కానుకగా ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా విడుదల

Published on Feb 27, 2015 2:23 PM IST

Yevade-Subramanyam
యువ హీరో నాని నటించిన తాజా సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 20న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పాటలు ఇటివలే విడుదలయ్యాయి. సినిమా ట్రైలర్, ఆడియోకు నుండి పాటలకు మంచి స్పందన లభించింది. హిమాలయాలు కాన్సెప్ట్ ప్రేక్షకులలో ఆసక్తి రేపింది. మౌంట్ ఎవరెస్ట్ వద్ద బేస్ క్యాంపులో షూటింగ్ జరిపిన తొలి సినిమాగా రికార్డుకెక్కింది. ఆ సినిమాలు సినిమాకు హైలైట్ అవుతాయని చిత్ర బృందం భావిస్తుంది.

నాని సరసన రితు వర్మ, మలయాళ భామ మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. స్వప్న సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల శిష్యుడు నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాకేశ్ – నవీన్ సినిమాటోగ్రాఫర్స్ గా వర్క్ చేశారు. రదన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు