యుఎస్ లో ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీ ఫస్ట్ షెడ్యూల్

యుఎస్ లో ఎన్.టి.ఆర్ – సుకుమార్ మూవీ ఫస్ట్ షెడ్యూల్

Published on Mar 3, 2015 4:12 PM IST

NTR_Sukumar1
టాలీవుడ్ క్రీజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సినిమానే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – సుకుమార్ లది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5 నుంచి ప్రారంభం కానుందని ఇదివరకే తెలియజేసాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మార్చి 5న యుఎస్ లో మొదలు కానుంది. యుఎస్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం యుఎస్ వెళ్లనున్నారు. ఎన్.టి.ఆర్ కోసం సుకుమార్ తన మార్క్ లవ్ స్టొరీ ఉంటూనే రివెంజ్ డ్రామాని ప్లాన్ చేసారు.

ఈ రివెంజ్ డ్రామాలో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉంటుందని సుకుమార్ తెలియజేశాడు. ఎన్.టి.ఆర్ కి ఫాదర్ పాత్రలో జగపతి బాబు కనిపించనున్నాడు. ‘టెంపర్’ తర్వాత సుకుమార్ కూడా తన సినిమాలో ఎన్.టి.ఆర్ ని మరో డిఫరెంట్ లుక్ లో చూపించనున్నాడు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు