
యువ హీరో మంచు మనోజ్ ప్రణతిరెడ్డి నిశ్చితార్ధం బుధవారం పార్క్ హయత్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. మొదట ప్రణతితో పురోహితులు గౌరీపూజ, ఆ తర్వాత మనోజ్ తోనూ పూజలు జరిపించారు. పిమ్మట మనోజ్ ప్రణతి తల్లిదండ్రులు లగ్నపత్రిక మార్చుకున్నారు. అనంతరం మనోజ్ ప్రణతి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు.
ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే, నిమ్మగడ్డ ప్రసాద్, తలసాని ప్రసాద్ తదితర రాజకీయ నాయకులు, దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, జెమినీ కిరణ్, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి బ్రహ్మాజీ, తాప్సీ, జయప్రద వంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు.

