
సూపర్ హిట్ హారర్ కామెడీ ‘ముని’ సిరీస్ లో వస్తున్న మూడవ సినిమా ‘కాంచన 2’. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనే హీరో. తాప్సీ హీరోయిన్. నిత్యా మీనన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
‘కాంచన 2’ సినిమాలో మహిళగా నాలుగు గెటప్పులలో రాఘవ లారెన్స్ కనిపిస్తారని చెన్నై మీడియా టాక్. ఒక మహిళా జీవితం నాలుగు దశలను (15, 25, 45 & 60 ఏళ్ళ వయసున్నప్పుడు ఇలా ఉంటారో) రాఘవ లారెన్స్ తన సినిమాలో చూపించబోతున్నారు. అని చెన్నై మీడియా నుండి అందుతున్న సమాచారం.
ఈ సినిమాకు ఐదుగురు సంగీత దర్శకులు స్వరాలను అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో సినిమా రూపొందుతుంది. తెలుగులో బెల్లంకొండ సురేష్ ‘కాంచన 2’ను విడుదల చేయనున్నారు.

