హీరోయిన్ ప్రాణాలు కాపాడిన కమెడియన్!

హీరోయిన్ ప్రాణాలు కాపాడిన కమెడియన్!

Published on Mar 6, 2015 6:45 PM IST

Karunakaran-and-Amy-Jackson
‘ఎవడు’, ‘ఐ’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమీ జాక్సన్.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తిరుకుమారణ్ దర్శకత్వంలో తమిళంలో రూపుదిద్దుకుంటున్న ఓ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా ఓ కొండపై బైక్ రైడింగ్ సీన్ లో నటిస్తున్న అమీ, ఒక్కసారిగా బైక్ పై నుంచి జారిపడి కొండమీద నుంచి కిందపడబోయిందట. సరిగ్గా అదే సమయంలో వెనకాలే మరో బైక్ పై ఉన్న హాస్యనటుడు కరుణాకరన్ ఆమెను ప్రాణాపాయం నుంచి తప్పించి అసలైన హీరోగా మారాడట.

కరుణాకరన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ కమెడియన్‌గా మంచి పేరుంది. ఇప్పుడీ కమెడియన్ ఏకంగా హీరోయిన్‌నే కాపాడి రియల్ లైఫ్ హీరోగా మారిపోయాడు.

తాజా వార్తలు