‘సన్నాఫ్ సత్యమూర్తి’ డబ్బింగ్ ప్రారంభించిన అల్లు అర్జున్.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ డబ్బింగ్ ప్రారంభించిన అల్లు అర్జున్.

Published on Mar 7, 2015 1:06 PM IST

SO-Satyamurthy
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. నిర్మాణంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నేడు అల్లు అర్జున్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సినిమా ఆడియోను మార్చి 15న విడుదల చేస్తున్నారు. సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 2న విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.

తాజా వార్తలు