అది రేప్ కన్నా ఘోరం : హన్సిక

అది రేప్ కన్నా ఘోరం : హన్సిక

Published on Mar 8, 2015 12:46 AM IST

hansika
సినీ నటి హన్సిక సైబర్ నేరగాళ్ళ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవి కాని ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పట్ల ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలా చేయడం రేప్ కన్నా ఘోరమని ఆమె అన్నారు. ఓ ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాము 365 రోజులూ శ్రమిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతుంటామనీ, తమపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు, చర్యలు చేయడం హేయమని అన్నారు.

ఆమధ్య ‘హన్సిక నగ్న ఫోటోలు’ అంటూ మార్ఫింగ్ చేయబడిన ఫోటోలు నెట్‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఈ విషయంపై తాను పోలీసులను సంప్రదించలేదని, ఫోటోల్లో ఉన్నది తాను కానప్పుడు పోలీసులను సంప్రదించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

తాజా వార్తలు