
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. గత వారం రోజుల నుండి ఈ సినిమా చిత్రీకరణ పోర్చుగల్లో జరుగుతుంది. రామ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లపై సాంగ్ షూట్ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ సోనాల్ చౌహన్ కూడా ‘పండగ చేస్కో’ టీంతో జాయిన్ అయ్యింది. మార్చి 23 వరకు జరిగే ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను, పాటలను తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్తో షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం.
ఎస్.ఎస్.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి ‘పండగ చేస్కో’ను నిర్మిస్తున్నారు. వేసవి బరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

