మార్చి 20న రానున్న సాయి కొర్రపాటి ‘తుంగభధ్ర’

మార్చి 20న రానున్న సాయి కొర్రపాటి ‘తుంగభధ్ర’

Published on Mar 8, 2015 6:52 PM IST

Tungabhadra
ఎక్కువగా స్టార్స్ కంటే కథను నమ్మి వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకునట్టున్న నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం. ఈ బ్యానర్ అధినేత అయిన సాయి కొర్రపాటి కొత్త దర్శకులను, కొత్త నటీనటులను ఎంకరేజ్ చేస్తూ చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాలను అందుకుంటుంది. ఈ సంవత్సరలో ఇప్పటికే ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సాయి కొర్రపాటి తన బ్యానర్ నుంచి వస్తున్న మరో సినిమా ‘తుంగభద్ర’

సాయి కొర్రపాటి శ్రీనివాస్ కృష్ణ గోగినేనిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాని మార్చి 20న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీ ద్వారా అదిత్ హీరోగా పరిచయం అవుతుంటే ‘రొమాన్స్’ ఫేం డింపుల్ చోపడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ యాక్టర్ సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి హరి గౌర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆడియోతో పాటు ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజా వార్తలు