గోపిచంద్ – సాయి ధరమ్ తేజ్ సమరానికి సిద్దం.!

గోపిచంద్ – సాయి ధరమ్ తేజ్ సమరానికి సిద్దం.!

Published on Mar 8, 2015 7:54 PM IST

gopi-chand-sai-darm-teja
టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జిల్’. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సినిమాల తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ – వంశీలు మరోసారి కొత్త డైరెక్టర్ రాధాకృష్ణని పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘జిల్’. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో మార్చి 12న రిలీజ్ కానుంది. అలాగే మూవీని మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మెగా క్యాంపు హీరో అయిన సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా ‘రేయ్’. చాలా రోజుల నుంచి విడుదలకు నోచుకోని ఈ సినిమాని ఎట్టకేలకు మార్చి 27న రిలీజ్ చేస్తున్నామని ఈ చిత్ర డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెలియజేశాడు. సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ లు హీరోయిన్స్ గా నటించారు. చక్రి మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి నిర్మాత కూడా వైవిఎస్ చౌదరి.

దీని ప్రకారం మాచో హీరో గోపీచంద్ – మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఒకే శ్రోజున బాక్స్ ఆఫీసు సమరానికి సిద్దం అవుతున్నారు. మరి అనుకున్నదాని ప్రకారం ఇద్దరూ వెనక్కి తగ్గకుండా అనుకున్న టైంకి అనగా మార్చి 27న బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడతారా లేదా అన్నది చూడాలి..

తాజా వార్తలు