కిక్ 2 టీంతో కలిసిన రకుల్ ప్రీత్ సింగ్

కిక్ 2 టీంతో కలిసిన రకుల్ ప్రీత్ సింగ్

Published on Mar 9, 2015 11:17 AM IST

Rakul-Preet_Singh
టాలీవుడ్లో గోల్డెన్ గర్ల్ గా మారిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం కూసింత సమయం కూడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీ బిజీ గా ఉంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రానున్న చలా క్రేజీ ప్రాజెక్ట్స్ లో రకుల్ ప్రీత్ హీరోయిన్ కావడం విశేషం. గత కొద్ది రోజులుగా రామ్ సినిమా పండగ చేస్కో కోసం పోర్చుగల్ లో స్టేప్పులేసిన రకుల్ ప్రీత్ ఆ సాంగ్ షూట్ ని ఫినిష్ చేసింది. ఆ సాంగ్ షూట్ ఫినిష్ చెయ్యడంతో రకుల్ ప్రీత్ సింగ్ తిరిగి ఇండియాకి వచ్చింది.

అంతే కాకుండా ఏ మాత్రం గ్యాప్ లేకుండా నేటి నుంచి మాస్ మహారాజ రవితేజ నటిస్తున కిక్ 2 సినిమా షూటింగ్ ని మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగుతోంది. గత కొద్ది రోజులుగా రవితేజ, ఇతర నటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. మే లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు