‘సూర్య vs సూర్య’తో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన నిఖిల్

‘సూర్య vs సూర్య’తో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన నిఖిల్

Published on Mar 9, 2015 12:40 PM IST

surya-vs-surya-success-meet
యంగ్ హీరో నిఖిల్ ‘సూర్య vs సూర్య’తో బాక్స్ ఆఫీసు వద్ద హ్యాట్రిక్ హిట్ ని నమోదు చేసుకున్నాడు. గత గురువారం రిలీజ్ అయిన ‘సూర్య vs సూర్య’ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది. అంటే కాకుండా మొదటి వీకెండ్ నిఖిల్ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ చిత్ర నిర్మాత మల్కాపురం శివకుమార్ అధికారికంగా తెలియజేసిన సమాచారం ప్రకారం ‘సూర్య vs సూర్య’ మొదటి 4 రోజుల్లో 7 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆంధ్ర, తెలంగాణ, ఓవర్సీస్ లలో కలుపుకొని ఈ కలెక్షన్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు.

అంతే కాకుండా నిఖిల్ కెరీర్లో ఇప్పటి వరకూ అత్యధిక కలెక్షన్స్ సాధించిన గ్రాసర్ గా కార్తికేయ ఉంది, ఆ రికార్డ్స్ ని ‘సూర్య vs సూర్య’ క్రాస్ చేసింది. దీని ప్రకారం మొదటి వారం మొత్తం మీద మంచి స్థాయిలోనే కలెక్షన్స్ వస్తాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేసాడు. కలెక్షన్స్, మౌత్ పబ్లిసిటీ పరంగా ఈ చిత్ర టీం అంతా చాల హ్యాపీగా ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో త్రిధా చౌదరి హీరోయిన్. మధుబాల, తనికెళ్ళ భరణి, సత్య కీలక పాత్రలలో నటించారు.

తాజా వార్తలు