రచయిత అవతారం ఎత్తిన తాప్సీ

రచయిత అవతారం ఎత్తిన తాప్సీ

Published on Mar 9, 2015 10:24 PM IST

Taapsee-latest
తాప్సీ.. తెలుగుతో పాటు ఇతర భాషలైన తమిళ, హిందీ సినిమాల్లోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బేబీ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత తాప్సీకి బాలీవుడ్‌లో అవకాశాల సంఖ్య పెరిగింది. ఆమె నటించిన రన్నింగ్‌షాదీ.కాం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నటిగా మాత్రమే ఆమె మనకు ఇప్పటివరకూ పరిచయం. అయితే తాజాగా తాప్సీ రచయిత అవతారమెత్తారు. రచయిత అంటే.. ఏ సినిమాకో స్క్రిప్ట్ రాస్తున్నారో అనుకోవద్దు. ఆమె రచయిత అవకాశమెత్తింది ఒక వెబ్‌సైట్ కోసం. ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్ మ్యాగజైన్‌లో మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఒక వ్యాసం రాశారు. ‘మూవింగ్ ఆన్.. ఓవర్.. ఆన్డ్ బియాండ్..’ అన్న శీర్షికన ఆమె రాసిన వ్యాసం చదువరులను ఆకట్టుకుంటోంది.

సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యంత సున్నితంగా, స్పష్టంగా, చాకచక్యంగా ఒక వ్యాసం ద్వారా తెలియజేశారు తాప్సీ. మహిళల దినోత్సవం (మార్చి 8) రోజున తనకు ఎదురైన కొన్ని సంఘటనలను ఒక వ్యాసంలా, స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తెలివైన ప్రశ్నల ద్వారా మన ముందుంచారామె. ఆ ప్రశ్నలన్నీ సమాజం నిరంతరం నెమరువేసుకోదగ్గవీ, సమాధానాలు వెతకదగ్గవి అయిన ప్రశ్నలు కావడం తాప్సీ రచనా శైలిని ప్రతిబింబిస్తుంది. ఈ అవతారాన్ని ఇక్కడితో సరిపెడతారా ? లేదా మరింత ముందుకెళ్ళి ఇంకా చైతన్యం లేవనెత్తే ప్రశ్నలను మనముందు ఉంచుతారా ? చూడాలి..

తాజా వార్తలు