
చిత్ర పరిశ్రమను తీవ్రంగా వేధిస్తున్న సమస్య పైరసీ. ఈ పైరసీ భూతం ఏ ఒక్క భాషకో పరిమితం కాలేదు. అన్ని భాషల నిర్మాతలను పైరసీ సమస్య పీడిస్తుంది. దీనికి పరిష్కార మార్గం ఇంకా దొరకలేదు. కోట్లాది రూపాయలను చిత్ర పరిశ్రమ కోల్పోతుంది. ఫలితంగా నిర్మాతల ఖజానాకు గండి పడుతుంది.
తమిళ చిత్రసీమ నిర్మాతలు సరికొత్త నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆదివారం నాడు తమిళ సినిమా నిర్మాతల మండలి జనరల్ బాడీ సమావేశం జరిగింది. మూడు నెలలు పాటు అన్ని సినిమాల విడుదలను నిలిపి వేయాలనే ఈ సమావేశంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. మెజారిటీ నిర్మాతలు ఈ ప్రతిపాదనకు అంగీకరించారట. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అప్పుల వడ్డీలు పెరుగుతుంటే.. మూడు నెలలు విడుదల ఆపమనడం సమజసం కాదని అంటున్నారు. తాము మరింత నష్టపోవాల్సి వస్తుందని చెప్తున్నారు.
మూడు నెలల పాటు సినిమాల విడుదల వాయిదా వేస్తే.. పైరసీ అంతం అవుతుందా..? అనే ప్రశ్నను కొందరు సంధిస్తున్నారు. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తీసుకుంటుందో..? వెయిట్ & సి.

