తెలుగులో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ప్రభుదేవా

తెలుగులో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ప్రభుదేవా

Published on Mar 10, 2015 11:26 AM IST

Prabhu-Deva
ఇటివల కేవలం అతిధి పాత్రలకు మాత్రమే పరిమితమవుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ కం దర్శకుడు ప్రభుదేవా హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ‘గ్రీన్ సిగ్నల్’ ఫేం విజయ్ మద్దాల చెప్పిన స్టొరీలైన్ ప్రభుదేవాకు బాగా నచ్చిందట. స్క్రిప్ట్ తదితర అంశాల గురించి దర్శకుడితో చర్చలు జరుపుతున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా తెరకెక్కనుంది.

అమెరికాలో రోడ్ ట్రిప్ నేపధ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. హీరో క్యారేక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. ప్రభుదేవా కథ వినగానే చాల ఎగ్జయిట్ అయ్యారు. అన్ని సవ్యంగా జరిగితే త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని దర్శకుడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

తమిళంలో తిరు దర్శకత్వంలో జై, త్రిష జంటగా నటిస్తున్న సినిమాలో కూడా కీలక పాత్రలో నటించడానికి ప్రభుదేవా అంగీకరించారు. ‘మైఖేల్ మదన్ కామరాజు’ తర్వాత ప్రభుదేవా తెలుగులో హీరోగా నటించలేదు. దర్శకుడిగా వరుస పరాజయాలు ఎదురవడంతో నటనపై దృష్టి పెట్టినట్టు ఉన్నారు.

తాజా వార్తలు