పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేస్తా : త్రిష

పెళ్ళి తర్వాత కూడా సినిమాలు చేస్తా : త్రిష

Published on Mar 11, 2015 3:33 AM IST

trisha
తన అందంతో, నటనతో తెలుగు, తమిళ, హిందీ ఇలా అన్ని భాషల సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.. త్రిష. దాదాపుగా అన్ని భాషల్లోనూ స్టార్ స్టేటస్‌ని కూడా సొంతం చేసుకోవడం ఘనత కిందే చెప్పుకోవచ్చు. ఇప్పుడా భామ పెళ్ళికి సిద్ధమౌతోంది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్ ఆమెను వివాహమాడనున్నారు. మరి పెళ్ళి తర్వాత సినిమాల్లో నటిస్తారా ? లేదా ? అన్న ప్రశ్న పరిశ్రమలో వినిపిస్తోంది. పెళ్ళి తర్వాత కూడా హీరోయిన్లుగా చేసిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. త్రిష ఆ లిస్ట్‌లో చేరతారా అన్నది కూడా ఒక ప్రశ్న.

ఈ ప్రశ్నలన్నింటికీ త్రిషాయే సమాధానాలు చెప్పుకొచ్చింది. పెళ్ళైన తర్వాత కూడా తాను సినిమాల్లో కొనసాగుతానని, హీరోలు కొనసాగగా లేనిది హీరోయిన్లు మాత్రం పెళ్ళి తర్వాత ఆగిపోవాలా అంటూ స్పందించింది. అయితే త్రిష కెరీర్ మాత్రం అనుకున్నంత స్థాయిలో లేదు. ఇప్పటికే ఆమె వద్దనున్న ప్రాజెక్టులన్నీ చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల తర్వాత తన కెరీర్‌ని ఎలా నిర్మించుకుంటుందనే దానిపైనే ఆమె అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

తాజా వార్తలు