రాఘవ లారెన్స్ ‘కాంచన 2’ ఫస్ట్ లుక్ & రిలీజ్ డేట్స్

రాఘవ లారెన్స్ ‘కాంచన 2’ ఫస్ట్ లుక్ & రిలీజ్ డేట్స్

Published on Mar 11, 2015 4:36 PM IST

raghava-lawrence
కొరియోగ్రాఫర్ నుంచి నటుడిగా, దర్శకుడిగా మారి ప్రేక్షకులను మెప్పించిన రాఘవ లారెన్స్ చివరి సినిమా ‘కాంచన’. హర్రర్ కామెడీగా వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ గా రానున్న సినిమాకి ముందు గంగ అనే టైటిల్ ని అనుకున్నా ఫైనల్ గా ‘కాంచన 2’ అని ఫిక్స్ చేసారు. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అందుకే చాలా రోజుల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తయినప్పటికీ విడుదలలో జాప్యం జరుగుతోంది.

గత కొంత కాలంగా రాఘవ లారెన్స్ ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి పనిచేత్సున్న సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కావస్తుండడంతో ఈ చిత్ర టీం ఈ సినిమా రిలీజ్ కి సన్నాహాలు చేసుకుంటోందని, అందులో భాగంగా మార్చి 16న ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి, సినిమాని ఏప్రిల్ 17న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని తెలియజేశారని సమాచారం.

రాఘవ లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ‘కాంచన 2’ సినిమాలో రాఘవ లారెన్స్ కనిపిస్తారని అదికూడా మహిళగా నాలుగు గెటప్పులలో కనిపిస్తారని సమాచారం. ఒక మహిళ జీవితంలోని నాలుగు దశలను (15, 25, 45 & 60 ఏళ్ళ వయసున్నప్పుడు ఎలా ఉంటారో) రాఘవ లారెన్స్ తన సినిమాలో చూపించబోతున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఐదు మంది సంగీత దర్శకులు కలిసి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు