చివరి దశలో.. సూర్య ‘మాస్’

చివరి దశలో.. సూర్య ‘మాస్’

Published on Mar 12, 2015 12:00 PM IST

Suriya-praises-Kamal-Haasan
గత సంవత్సరం సికిందర్ (అంజాన్)తో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇకపై మాత్రం అలా జరగకుండా ఉండేందుకు సరికొత్త కథాంశాల నేపథ్యంలో సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే ‘మాస్’ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా గడిపేస్తున్న సూర్య.. త్వరలోనే ‘హైకు’, ’24’ సినిమాల షూటింగుల్లో పాల్గొంటారు. తమిళంలో సరికొత్త కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే వెంకట్ ప్రభుతో కలిసి చేస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ‘మాస్’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 7కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం.

మాస్ షూటింగ్ పూర్తైన వెంటనే త్వరితగతిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి మే 1న సినిమాని ఇటు తెలుగులో, అటు తమిళంలో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు సూర్య సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమా పూర్తైన వెంటనే సూర్య, ‘హైకు’ సినిమాలోని గెస్ట్ రోల్‌లో నటిస్తారు. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న విక్రమ్ కుమార్ ’24’ సినిమా కూడా ఏప్రిల్‌లోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

తాజా వార్తలు