తమిళంలో మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’

తమిళంలో మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’

Published on Mar 15, 2015 2:00 PM IST

i-nenokadine

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, ఈ సినిమా విమర్శకులను మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 6న ‘1 ఒరుత్తం’ అనే పేరుతో విడుదలై కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు ఇదే సినిమాని తమిళంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘1’ అనే పేరుతో తమిళంలో రిలీజ్ కానున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ గా నటించారు. ఈ సినిమాతో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ వెండితెరకు పరిచయం అయ్యాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

తాజా వార్తలు