పూరి – మహేష్ సినిమాకి గిబ్రాన్ మ్యూజిక్

పూరి – మహేష్ సినిమాకి గిబ్రాన్ మ్యూజిక్

Published on Mar 15, 2015 6:30 PM IST

mahesh_puri

యంగ్ అండ్ టాలెంటెడ్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ మెల్ల మెల్లగా తెలుగులో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్ళి పోతున్నాడు. తమిళంలో కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఇది కాకుండా తెలుగులో ఇప్పటికే ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇది కాకుండా ఇటీవలే రిలీజ్ అయిన ‘జిల్’ ఆడియోతో కూడా గిబ్రాన్ మరోసారి తెలుగులో స్టైలిష్ ఆల్బం ఇచ్చాడు. ఇప్పుడు ఇతనికి తెలుగులో మార్కెట్ తో పాటు ఆఫర్స్ కూడా వెల్లువలా వస్తున్నాయి.

తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం గిబ్రాన్ కి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. అదే స్పోఅర్ స్టార్ మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి జిబ్రాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఖరారు కాకపోయినా కచ్చితంగా ఇదే కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఈ చిత్రానికి దగ్గరి వారు చెబుతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మించనున్నాడు.

తాజా వార్తలు