టాలీవుడ్ క్రీజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సినిమానే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – సుకుమార్ లది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదటగా మార్చి మధ్యలో మొదలు పెట్టాలనుకున్నారు కానీ కాస్త ఆలస్యం అవ్వడంతో ఏప్రిల్ 2వ వారానికి వెళ్ళినుంది. దాంతో ఈ చిత్ర టీం టైం ఉంది కదా అని రిలాక్స్ అవ్వకుండా మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రసతుతం ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ యుకె లో మొదలవుతుంది. ఎన్.టి.ఆర్ కోసం సుకుమార్ తన మార్క్ లవ్ స్టొరీ ఉంటూనే రివెంజ్ డ్రామాని ప్లాన్ చేసారు.
ఈ రివెంజ్ డ్రామాలో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉంటుందని సుకుమార్ తెలియజేశాడు. ఎన్.టి.ఆర్ కి ఫాదర్ పాత్రలో జగపతి బాబు కనిపించనున్నాడు. ‘టెంపర్’ తర్వాత సుకుమార్ కూడా తన సినిమాలో ఎన్.టి.ఆర్ ని మరో డిఫరెంట్ లుక్ లో చూపించనున్నాడు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్.


