
ఆర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమౌతోన్న సినిమా ‘సైజ్‌జీరో’. ప్రతిష్టాత్మిక పీవీపీ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ఈ సినిమా ‘ఇంజి ఇడుప్పజాగి’ పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అనుష్క సరికొత్తగా కనిపించనుందని సమాచారం. సినిమాలో కొంత భాగం ఎక్కువ బరువున్న వ్యక్తిగా కనిపిస్తూ తర్వాత సైజ్జీరోకు మారిపోయే పాత్రలో అనుష్క కనిపించనుందని తెలుస్తోంది.
పూర్తి రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఈషా గుప్త, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైద్రాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాకు ఎమ్.ఎమ్. మరకత మణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

