‘లెనిన్’ పై కింగ్ నాగ్ రివ్యూ.. రిలీజ్ పై కూడా బిగ్ అప్డేట్!

‘లెనిన్’ పై కింగ్ నాగ్ రివ్యూ.. రిలీజ్ పై కూడా బిగ్ అప్డేట్!

Published on Apr 29, 2026 10:11 AM IST

Nagarjuna-Lenin

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం లెనిన్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఆల్రెడీ పలు వాయిదాలు పడింది. తాజాగా మళ్ళీ వాయిదా అంటూ పలు రూమర్స్ వచ్చాయి. కానీ లేటెస్ట్ గా కింగ్ నాగ్ అక్కినేని అభిమానులకి పెద్ద బూస్టప్ ని అందించారు అని చెప్పాలి.

లెనిన్ సినిమా ఫస్ట్ కట్ ని గత రాత్రి చూసాను. చాలా నమ్మకంగా చెబుతున్నాను మీరు కొత్త అఖిల్ ని చూడబోతున్నారు అంటూ సాలిడ్ రివ్యూ అందించారు. అంతే కాకుండా రిలీజ్ డేట్ పై కూడా బిగ్ అప్డేట్ తాను అందించారు. సినిమా జూన్ 26న గ్రాండ్ గా విడుదల కానుంది అని డేట్ మార్క్ చేసుకోండి అంటూ సాలిడ్ అప్డేట్ అందించారు. దీనితో లెనిన్ రిలీజ్ రూమర్స్ కి కూడా చెక్ చెప్పేసినట్టే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు