తమ్ముడి సినిమాలో అన్న గెస్ట్ రోల్!

తమ్ముడి సినిమాలో అన్న గెస్ట్ రోల్!

Published on Apr 14, 2015 8:31 PM IST

Naga-Chaitanyas-first-look
అన్నయ్య.. తాత, తండ్రి నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కొత్తదనమున్న కథలతో దూసుకుపోతున్న లవర్ బాయ్. తమ్ముడు.. ఫస్ట్‌లుక్ టీజర్‌తోనే స్టార్ హీరోగా ఎదిగే రేంజ్ గల హీరో అనే అభిప్రాయాల మధ్య తెలుగు తెరకు పరిచయం కానున్న మరో వారసుడు. వారే అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్. ఇంతకుముందు వీరిద్దరూ ఓ సినిమాలో కొద్దిసేపు అలా మెరిసి మురిపించారు. ఇప్పుడు తాజాగా మరోసారి కలిసి మెరవనున్నారు. అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ హీరో నితిన్ ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ప్రతిదీ పక్కాగా, చాలా స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే అఖిల్ ఎంట్రీ టీజర్, ఫస్ట్‌లుక్ టీజర్‌లతో సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఇక తాజాగా ఈ సినిమాలోకి మరో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి చేరనుంది. అఖిల్ సినిమాలో నాగచైతన్య ఓ గెస్ట్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారికంగా ఏ విషయం తెలియకపోయినా సినీ వర్గాల సమాచారం మేరకు ఇందుకు తగ్గ ప్లాన్ కూడా ఇప్పటికే తయారైనట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకు అఖిల్ సినిమా.. ఓ పండగే!

తాజా వార్తలు