పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఫౌజీ’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని, మిగిలిన భాగాన్ని కూడా త్వరగా ముగించి ఈ ఏడాది చివరికల్లా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ సినిమాలో వచ్చే వార్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయని, దర్శకుడు హను యుద్ధ సన్నివేశాలను చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారని చెర్రీ పేర్కొన్నారు. ‘రాజాసాబ్’ కంటే ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకోవడంతో, ఈ వార్ ఎపిసోడ్స్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
నిజానికి ‘రాజాసాబ్’ కోసం డేట్స్ కేటాయించడం వల్ల ‘ఫౌజీ’ కాస్త ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం ప్రభాస్ పూర్తి దృష్టి ఈ సినిమాపైనే పెట్టాడు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని డార్లింగ్ చూస్తుండటంతో అభిమానులకు పెద్ద ఊరటనిస్తోంది. ఈ ఏడాది చివర్లో ప్రభాస్‌ను పవర్‌ఫుల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో చూడటం ఖాయమనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం కానుంది.


