ఈ నెల్లోనే ‘1 నేనొక్కడినే’ తమిళ వర్షన్ విడుదల..!

ఈ నెల్లోనే ‘1 నేనొక్కడినే’ తమిళ వర్షన్ విడుదల..!

Published on Apr 15, 2015 9:40 PM IST

Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సరికొత్త కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘1 నేనొక్కడినే’. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసులు రాల్చకపోయినా మహేష్ కెరీర్లో మరచిపోలేని సినిమాగా నిలిచింది. తెలుగు సినిమా స్థాయికి ఎంతో ఎత్తున నిలిచిన ‘1 నేనొక్కడినే’ సినిమా, ఐఎమ్‌డీబీ సైట్లో ఇప్పటికే మంచి ర్యాంక్‌లో కొనసాగుతూ ఉంది.

1 నేనొక్కడినే సినిమాను ఈ మధ్యే మళయాలంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మళయాలంలో మంచి స్పందనే వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాను తమిళంలో విడుదల చేయనున్నారు. ఎప్పట్నుంచే విడుదల చేయాలనుకున్నా వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. 1 నేనొక్కడినే డబ్బింగ్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి కాగా, ఈనెల 24న సినిమాను విడుదల చేయనున్నారు. మరి తమిళ ప్రేక్షకులను మహేష్ నేనొక్కడినే ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది వేచి చూడాలి!

తాజా వార్తలు