అందరి కళ్ళూ ఆమెపైనే…

అందరి కళ్ళూ ఆమెపైనే…

Published on Apr 16, 2015 3:53 AM IST

Jyothika
దక్షిణాదిన తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్న నాయికలు అరుదు. ఆలాంటి వారిలో నటి జ్యోతిక ఒకరు. తన నటనతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ వివాహానంతరం నటనకు దురమయ్యి నిజ జీవితంలో బ్రతుకుంతుంది. అయితే దాదాపు 5ఏళ్ళ విరామం తరువాత భర్త సూర్య ప్రోద్భలంతో మరోసారి సినిమాలకు దగ్గరయ్యింది.

’36 వయందినిలే’ అనే తమిళ సినిమా ద్వారా త్వరలో మనల్ని పలకరించనుంది. ఈ సినిమా పూర్తిచేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ సంపాదించుకుంది. సినిమా ప్రియులు జ్యోతికను మరోసారి తెరమీద చూసేందుకు ఉవ్విళ్ళూరతుండడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

తాజా వార్తలు