శంషాబాద్లో ‘బెంగాల్ టైగర్’ విహారం.!

శంషాబాద్లో ‘బెంగాల్ టైగర్’ విహారం.!

Published on Apr 23, 2015 1:18 AM IST

Bengal-Tiger
‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంపత్ నంది చాలా రోజుల గ్యాప్ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా చేస్తున్న సినిమా ‘బెంగాల్టైగర్’. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో జరుగుతోంది. అక్కడ ఈ చిత్ర టీం రవితేజ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ తర్వాత షూటింగ్ రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అవుతుంది.

సెకండ్ షెడ్యూల్ లో ముద్దుగుమ్మలైన తమన్నా, రాశి ఖన్నాలు కూడా పాల్గొంటున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే విధంగా సంపత్ నంది అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ సిద్దం చేశారని యూనిట్ వర్గాల సమాచారం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా రవితేజ నటించిన కిక్ 2 సినిమా కూడా చివరి దశకు చేరుకుంది. కిక్ 2 సినిమా మే మిడిల్ లో రిలీజ్ కానుంది.

తాజా వార్తలు