కన్ఫ్యూజన్ తొలగించేందుకు వస్తున్న ‘పెద్ది’ టీమ్.. ఎప్పుడంటే..?

కన్ఫ్యూజన్ తొలగించేందుకు వస్తున్న ‘పెద్ది’ టీమ్.. ఎప్పుడంటే..?

Published on Apr 30, 2026 8:08 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో మేకర్స్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్ర విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెర దించుతూ ‘పెద్ది’ టీమ్ ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవుతుంది.

దర్శకుడు గతంలో జూన్ 25 అని ప్రకటించినప్పటికీ, ట్రేడ్ వర్గాల్లో మాత్రం జూన్ 4న సినిమా వచ్చే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అయోమయాన్ని తొలగించి, అధికారికంగా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసేందుకు చిత్ర యూనిట్ రేపు(మే 1) హైదరాబాద్‌లో ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో విడుదల తేదీతో పాటు సినిమా షూటింగ్ అప్డేట్స్, పోస్ట్ ప్రొడక్షన్ వివరాలు మరియు ప్రమోషనల్ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ అవతారంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు