
నిన్న ఉన్నపాటుగా నేపాల్ లోని ఖాట్మండు ప్రాంతంలో వచ్చిన భూకంపం వలన పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ఇండియాలోని పలు ప్రాంతాల్లో కూడా కనిపించింది. ఈ భూకంపం వల్ల తెలుగు ఫిల్మ్ కి చెందిన 20 మంది మిస్ అయ్యారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ‘ఎటకారం.కామ్’కి చెందిన 20 మంది ఈ భూకంపం వల్ల కనిపించడం లేదు.
ఈ చిత్ర టీం గత కొద్ది రోజులుగా ఖాట్మండులో భూకంపం వచ్చిన ప్రాంతానికి దగ్గరలో షూటింగ్ చేస్తున్నారు. ఈ భూకంపం జరిగినప్పటి నుంచీ ఈ చిత్ర టీం మిస్ అయ్యింది. మిస్ అయిన వారి ఫ్యామిలీ మెంబర్స్ మరియు షూటింగ్ చేస్తున్న టీం ఈ మిస్ అయిన వారి కోసం ఎంత వెతికినా వారి ఆచూకి తెలియడంలేదు. నేపాల్ లో వచ్చిన భూకంపం వలన అక్కడ కమ్యూనికేషన్ సిస్టం లోపించడంతో వారిని కాంటాక్ట్ చేయలేకపోతున్నారు. వీరేందర్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్.
వీరేందర్ రెడ్డి సీనియర్ డైరెక్టర్ అయిన ఎస్.వి కృష్ణారెడ్డికి బందువు అవుతాడు. ఈ ఫిల్మ్ యూనిట్ మాత్రమే కాకుండా ఇరు రాష్ట్రాల నుండి టూర్ వెళ్ళిన పలువురు తెలుగు వారు కూడా అక్కడ ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఇలా ఇరుక్కుపోయిన అందరినీ కాపాడడం కోసం నేపాల్ ప్రభుత్వం సహాయక కార్యక్రమాలను చేపట్టింది.

