
మన తెలుగులో సినిమాలకి భాషా భేదం లేకుండా ప్రేక్షకాదరణ ఉంటుంది. పరభాషా హీరో అయిన ఓక్సారి అతని సినిమా ఇక్కడ హిట్ అయ్యింది అంటే అతని సినిమాలు ఇక తెలుగులో వస్తూనే ఉంటాయి. అలా కొలవెరి డీ సాంగ్ తో బాగా ఫేమస్ అయిన ధనుష్ హీరోగా నటించిన మూడు సినిమాలు – రఘువరన్ బి.టెక్, పందెం కోళ్ళు, అనేకుడు ఈ ఏడాది తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే బాటలోనే ధనుష్ నటించిన మరో సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమానే ‘మరియన్’.
ఇదే ‘మరియన్’ పేరుతో 2013లో తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాక, హిట్గా నిలిచింది. అదే సినిమాని అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. భరత్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఏ.ఆర్. రహమాన్ మ్యూజిక్ అందించాడు. ఎఆర్ రెహమాన్ పాటలు అందించిన ఈ సినిమా తెలుగు ఆడియోని నిన్న హైదరాబాద్ లో లాంచ్ చేసారు. అలాగే సినిమాలో మే లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

