
రెండు రోజుల క్రితం హఠాత్తుగా ప్రకృతి విలయ తాండవం చేయడతో నేపాల్ భారీ భూకంపం వచ్చింది. దీనివల్ల ఖాట్మండుతో పాటు పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం ఇండియాలోని పలు ప్రాంతాల్లో కూడా కనిపించింది. ఒక్కసారితో ఆగిపోకుండా నిన్న కూడా మరోసారి భూమి కంపించింది. ఈ భూకంప సమయంలో షూటింగ్ కి వెళ్ళిన ‘ఎటకారం.కామ్’ అనే తెలుగు ఫిల్మ్ యూనిట్ కి చెందిన 20 మంది మిస్ అయ్యారని ఇది వరకే తెలియజేసాం.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీంని శోఖ సముద్రంలో ముంచే విషయం ఒకటి చోటు చేసుకుంది. అదేమిటంటే ఈ చిత్ర యూనిట్ లోని విజయ్ అనే డాన్స్ కొరియోగ్రాఫర్ ఈ భూకంప ఎఫెక్ట్ లో చనిపోయాడు. భూకంప ప్రభావంతో ఈ చిత్ర టీం షూటింగ్ స్టాప్ చేసి వెనక్కి బయలు దేరారు. మార్గ మధ్యంలో భూకంప తీవ్రత ఎక్కువ కావడంతో కారు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో కొరియోగ్రపార్ విజయ్ మృతి చెందాడు. ప్రస్తుతం విజయ్ మృతదేహాన్ని హైదరాబాద్ కి చెందిన ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ గుంటూరు జిల్లాలోని బాపట్లకి చెందిన వ్యక్తి. ఈ విషయం చిత్ర టీంని, విజయ్ ఫ్యామిలీని శోఖ సముద్రంలో పడేసింది.
ఇలా అనుకోకుండా జరిగిన ప్రకృతి వైపరిత్యంలో ప్రాణాలు వదులుకున్న విజయ్ ఫ్యామిలీకి, తన మూవీ టీంకి 12తెలుగు.కామ్ తరపున సంతాపం తెలియజేస్తున్నాం.

