సూర్య ‘మాస్’కు అంతటా భారీ క్రేజ్!

సూర్య ‘మాస్’కు అంతటా భారీ క్రేజ్!

Published on Apr 29, 2015 11:02 PM IST

mass
ఎప్పుడూ సరికొత్త కథలతో, విభిన్న గెట‌ప్‌లతో మనల్ని మెప్పిస్తూ ఉండే తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో మరో సరికొత్త సినిమాతో మన ముందుకు రానున్నాడు. ‘గ్యాంబ్లర్'(మంగాత్తా), ‘బిర్యాని’ సినిమాల ద్వారా దర్శకుడుగా తానేంటో నిరూపించుకున్న వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్‌తో కలిసి సూర్య సొంతంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

‘మాస్’ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా తమిళ వర్షన్‌కు సంబంధించిన అఫీషియల్ టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య ఆత్మగా కనిపించి భయపెడతాడని సమాచారం. ఈ సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో భారీగా ప్రచారాన్ని కల్పించేందుకు సినిమా యూనిట్ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ‘మాస్’, ప్రపంచవ్యాప్తంగా మే 15న ప్రేక్షకుల ముందుకు కానుంది.

తాజా వార్తలు