మెగాస్టార్ 150వ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధమైందా?

మెగాస్టార్ 150వ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధమైందా?

Published on Apr 30, 2015 4:21 PM IST

chiranjeevi

మెగాస్టార్ 150వ సినిమాకు రంగం సిద్ధమైందా? మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు తెరపడినట్టేనా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలుగులో బ్లాక్‌బస్టర్ సినిమాలతో బ్లాక్‌బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఈ క్రేజీ ప్రాజెక్టు విషయంపై తాజాగా సంకేతాలిచ్చారు.

కొద్దిసేపటి క్రితం బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో ఇదే విషయమై ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓ ట్వీట్‌లో రచయిత బీవీఎస్ రవి, మరో ఇద్దరితో లంచ్ చేస్తూ దిగిన ఫోటోను పోస్ట్ చేసి, సినిమా ‘స్టోరీ లాక్ అయింది’ అన్న విషయాన్ని వెల్లడించారు. ఈ పోస్ట్‌లో పూరీ జగన్నాథ్‌ను ట్యాగ్ చేయడం విశేషంగా కనిపిస్తోంది. చిరంజీవి 150వ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని బండ్ల గణేష్ ఇన్‌డైరెక్ట్‌గా తెలియజేశారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. అదే పోస్ట్‌కు వచ్చిన రిప్లైల్లో అందరూ ‘సినిమా చిరంజీవి గారితోనేనా?’ అనే ప్రశ్నను లేవనెత్తగా, ఆ ప్రశ్నలకు, ‘అన్నయ్య సపోర్ట్‌తో, దేవుడి ఆశీస్సులతో సూపర్‌హిట్ సినిమాలు తీస్తా’ అన్న సమాధానమిచ్చారు బండ్ల గణేష్. ఇక దీంతో అభిమానులు బండ్ల గణేష్, పూరీ జగన్నాథ్, చిరంజీవిల కాంబినేషన్‌లో సినిమా కన్‌ఫర్మ్ అనే అభిప్రాయానికి వచ్చేశారు. అన్నీ సవ్యంగా జరిగితే త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్‌పైకి కూడా వెళ్ళనుందనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు