ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన పలు చిత్రాల్లో కాంట్రవర్సియల్ చిత్రం ది కేరళ స్టోరీ 2 కూడా ఒకటి. ఆదా శర్మ, సిద్ది ఇద్నాని నటించిన గత చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఒక సంచలనమే కాకుండా పలు వివాదాలకు కూడా దారి తీసింది. లవ్ జిహాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి కొనసాగింపుగా నిజ జీవితంలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా దర్శకుడు కామాఖ్యా నారాయణ సింగ్ తెరకెక్కించిన ఈ పార్ట్ 2 కూడా ఆడియెన్స్ లో ఒక అవగాహనా సినిమాగా పేరు తెచ్చుకుంది.
మరి ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని జీ 5 వారు సొంతం చేసుకోగా అందులో ఇవాళ్టి నుంచే ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇది తెలుగులో థియేటర్స్ లో విడుదల అయ్యినట్టు కూడా చాలా మందికి తెలియదు. సో ఈ సినిమాని చూడాలి అనుకునేవారు చూడొచ్చు. ఈ చిత్రంలో అదితి భాటియా, ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా లు ప్రధాన పాత్రల్లో నటించారు.


