అరుదైన రికార్డుపై ఆనందం వ్యక్తం చేసిన బోయపాటి శ్రీను

అరుదైన రికార్డుపై ఆనందం వ్యక్తం చేసిన బోయపాటి శ్రీను

Published on May 2, 2015 11:20 PM IST

Boyapati-Sreenu11
2014లో విడుదలైన నందమూరి నటసింహం బ్లాక్ బస్టర్ ‘లెజెండ్’ సినిమా సింగిల్ థియేటర్ ఫుల్ రన్ లో 400రోజులు నిర్విరామంగా ప్రదర్శింపబడి అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఈ సినిమా మార్చ్ 2014న విడుదలై కర్నూల్ జిల్లాలో మినీ శివ థియేటర్ లో 400రోజులు పూర్తిచేసుకుంది.

ఈ అరుదైన రికార్డుకి దర్శకుడు బోయపాటి శ్రీను ఆనందంలో మునిగితేలాడు. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో ఇంతటి ఘనత సాధించిన సినిమాలో తాను కూడా ఒక భాగం కావడం ఆనందకరమని తెలిపాడు. సినిమాను విజయం చేసిన ప్రేక్షకులకు, ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఈ ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఘన విజయం విజయోత్సవ సభకు నారా చంద్రబాబునాయుడు, బాలకృష్ణ తదితరులు హాజరుకానున్నారు. 14రీల్స్ మరియు వారాహి చలన చిత్ర బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే హీరోయిన్స్.

తాజా వార్తలు