బాలయ్య 99వ సినిమా స్క్రిప్ట్ ఖరారు

బాలయ్య 99వ సినిమా స్క్రిప్ట్ ఖరారు

Published on May 2, 2015 11:30 PM IST

balakrishna1
లక్ష్యం దర్శకుడు శ్రీవాస్ తో బాలకృష్ణ 99వ సినిమా వుంటుందని మేము ముందుగానే ప్రకటించాం. ఈ సినిమాకు డిక్టేటర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ మొదలుకానుంది.

ఇటీవలే కోనా వెంకట్ స్క్రిప్ట్ ని బాలకృష్ణకి వినిపించినట్టు అది బాలయ్య బాబుకి చాలా నచ్చినట్టు సమాచారం. దీంతో రెట్టించిన ఉత్సాహంతో బృందమంతా సినిమాని త్వరలో మొదలుపెట్టే పనిలో వున్నారు.

థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య నటించిన ‘లయన్’ ఈ నెల 8న విడుదలకానుంది.

తాజా వార్తలు