బాలయ్య ‘లయన్’ రన్ టైం

బాలయ్య ‘లయన్’ రన్ టైం

Published on May 3, 2015 8:12 PM IST

balayya-lion
‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ మరో సారి ద్విపాత్రాభినయంలో చేసిన పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. ట్రైలర్స్ తో అభిమానుల్లో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. సెన్సార్ కి పంపాల్సిన సినిమా మొత్తాన్ని ఎడిట్ చేసి ఈ చిత్ర టీం రన్ టైంని లాక్ చేసారు.

మాకు అందిన సమాచారం ప్రకారం లయన్ రన్ టైం 149 నిమిషాలు. కేవలం రెండున్నర గంటల్లో సినిమాని ఫినిష్ చేసేయ్యడంతో ఆడియన్స్ కూడా ఎక్కడా బోర్ ఫీలవ్వరు అని ఈ చిత్ర టీం భావిస్తోంది. బాలకృష్ణ మొదటి సారి ఈ సినిమాలో ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సతి దేవా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

తాజా వార్తలు