మేలో బాక్స్ ఆఫీసుపై స్టార్స్ దండయాత్ర

మేలో బాక్స్ ఆఫీసుపై స్టార్స్ దండయాత్ర

Published on May 4, 2015 7:00 PM IST

all-movies
సమ్మర్ సీజన్ వచ్చేసింది.. సమ్మర్ సీజన్ వచ్చింది అంటే అటు స్కూల్, కాలేజీలకి హాలిడేస్ కానీ థియేటర్స్ మాత్రం ఫుల్ బిజీగా ఉండడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ వరద కనిపిస్తుంది. ఇప్పటికే సమ్మర్ లో మొదటి చిత్రంగా వచ్చిన ‘S/O సత్యమూర్తి’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టింది. సమ్మర్ లో సినిమాలకి బిగ్గెస్ట్ హెల్ప్ అయ్యే అసలైన మే నెల మొదలైంది. మే అలా మొదలైందో లేదో అప్పుడే ‘ముని’, ‘ఉత్తమ విలన్’ సినిమాలు వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేస్తూ కాసులు రాబట్టుకోవడం మొదలు పెట్టాయి.

ఇక రానున్న నాలుగు వారాల్లో కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కొన్ని రిలీజ్ కానున్నాయి. అందులో ముందుగా మే 8న నందమూరి బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమా వస్తోంది. అదే రోజున మంచు లక్ష్మీ నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘దొంగాట’ కూడా రిలీజ్ కానుంది. ఆ తర్వాత సందీప్ కిషన్ నటించిన టైగర్ సినిమా మూడవ వారం రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇంతే కాకుండా సూర్య నటించిన ‘మాస్’, రామ్ నటించిన ‘పండగ చేస్కో’, రవితేజ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ ‘కిక్ 2’ కూడా మే లోనే రిలీజ్ కానున్నాయి. త్వరలోనే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే గుణశేఖర్ అనుష్కతో చేసిన పీరియాడికల్ మూవీ ‘రుద్రమదేవి’ని కూడా మే 22న రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు.

మరి ఇన్ని సినిమాలతో టాలీవుడ్ లో మే నెల బాగా బిజీ అయిపోనుంది. మరి ఇందులో ఎన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆధ్యంతం ఎంటర్టైన్ చేసి సక్సెస్ఫుల్ మూవీస్ గా నిలుస్తాయా లేక ఎవన్నా కొన్ని ఆడియన్స్ ని నిరుత్సాహపరుస్తాయా అన్నదాని కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు