
తమిళంలో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. స్క్రీన్ ప్లేతో ప్రతి సారి మేజిక్ చేసే వెంకట్ ప్రభు ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా తమిళ ఆడియో మే 8న రిలీజ్ కానుంది. ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి తెలిగు టైటిల్ ని ఖరారు చేసారు.
తెలుగులో మాస్ సినిమాకి ‘రాక్షసుడు’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా కథాంశం ఓ దెయ్యాల యొక్క తీరని కోరికలను తీర్చే ఓ యువకుడి చుట్టూ ఈ కథని అల్లుకున్నారు. తెలుగులో కూడా త్వరలోనే ఆడియోని రిలీజ్ చేసి ఈ నెలాఖరున సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే తమిళంలో రిలీజ్ అయిన టీజర్ కి సూపర్బ్ క్రేజ్ వచ్చింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సూర్య సరసన నయనతార, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.

