వివాదాస్పద డైలాగ్స్ పై స్పందించిన రామ్

వివాదాస్పద డైలాగ్స్ పై స్పందించిన రామ్

Published on May 5, 2015 2:48 PM IST

ram
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పండగ చేస్కో’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఇటీవలే రిలీజ్ చేసారు. ఆడియో రిలీజ్ రోజున ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో రామ్ చెప్పిన ఓ డైలాగ్ కొంతమంది స్టార్ హీరోల అభిమానుల మనోబావాలను దెబ్బతీసింది. ఆ వివాదం పెద్దది అయ్యే స్టేజ్ లో ఉండగా ఆ విషయం పై రామ్ స్పందించి ఆ వివాదాన్ని పెద్దది కాకుండా చేసాడు.

ఇక అసలు విషయంలోకి వెళితే పండగ చేస్కో రామ్ చెప్పిన డైలాగ్ ‘ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీ లో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లో నుంచి వచ్చే దమ్ములో ఉంటది.. ఇలాంటి ఎదవ సొల్లు చెప్పడం నాకు చిరాకు రా’. ఈ డైలాగ్ పలువు స్టార్ హీరోలు చెప్పిన డైలాగ్స్ కి సిమిలర్ గా ఉండడంతో ఆయా స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ని బాగా సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఇష్యూని కూల్ చేయడం కోసం రామ్ స్పందిస్తూ ‘అందరికీ క్లారిఫై చెయ్యడం కోసం చెప్తున్నాను.. పండగ చేస్కో ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ తో ఎవ్వరినీ టార్గెట్ చెయ్యలేదు. మన పని మనం చేసుకునే స్కూల్ నాదని’ రామ్ ట్వీట్ చేసాడు.

కోన వెంకట్ డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ లతో రామ్ రొమాన్స్ చేసిన ఈ సినిమాకి పరుచూరి కిరీటి నిర్మాత. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మే చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు