
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాల సూపర్ హిట్ తర్వాత కలర్స్ స్వాతి లైయాస్ సవతి రెడ్డి చేస్తున్న ఫుల్ లెంగ్త్ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘త్రిపుర’. గత ఏడాది అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకి ఇది సీక్వెల్. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్లో జరుగుతోంది. స్వాతి చేస్తున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే స్వాతి పై పెళ్లి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సీన్స్ ని షూట్ చేసారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్వాతికి సపోర్ట్ గా వచ్చే ఓ కీ రోల్ ని చెయ్యడానికి యంగ్ హీరో ని ఫైనలైజ్ చేసారు. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నవీన్ చంద్ర ఈ సినిమాలో కథని మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నాడు. క్రేజీ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ ఈ సినిమాకి కోన వెంకట్ కథని అందించాడు. గీతాంజలికి దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్ ఈ సినిమాకి కూడా దర్శకుడు.

