
సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ, జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అయినప్పటికీ, ‘పెదరాయుడు’ సినిమా తర్వాత ఆయన డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయలేదు. తాజాగా ఆయన ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
లింగ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న రజినీకాంత్ మూడవ సారి శంకర్ తో కలిసి ‘రోబో 2’ సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చాయి, కానీ ఫైనల్ గా రజినీకాంత్ రెండు సినిమాల అనుభవం ఉన్న రంజిత్ కి అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే రంజిత్ చెప్పిన కథ రజినీకాంత్ ని ఆకట్టుకుంది. ఈ సినిమాని ఒక్సేసారి తెలుగు, తమిళ భాషల్లో షూట్ చేయనున్నాం అని ఈ చిత్ర నిర్మాత కలైపులి థాను తెలియజేశాడు. రంజిత్ గతంలో అట్టకత్తి, మద్రాస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అందరూ రజినీకాంత్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేస్తాడని ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం రంజిత్ కి అవకాశం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

