పెళ్లి కాన్సల్, మళ్ళీ సింగిల్ అంటున్న త్రిష

పెళ్లి కాన్సల్, మళ్ళీ సింగిల్ అంటున్న త్రిష

Published on May 8, 2015 8:00 PM IST

trisha-Varun-Mannian
గత 15 సంవ్సత్సరాలుగా తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన భామ త్రిష. ఈ మధ్య కాలంలో ఆమె ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయకపోయినా, చేసే ఒకటి రెండు సినిమాలను మాత్రం స్టార్ హీరోలతోనే చేస్తూ వరుస విజయాలను అందుకుంటోంది. ఇదిలా ఉంటే అందరినీ షాక్ చేసేలా జనవరిలో పారిశ్రామికవేత్త, తమిళ నిర్మాత అయిన వరుణ్‌ మణియన్‌ తో త్రిష నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుకకి అందరూ ఆహ్వానితులు కాకపోయినా ప్రైవేట్ గా గ్రాండ్ గా నిశ్చితార్ద వేడుక జరిగింది.

నిశ్చితార్ధం రోజున వీరి పెళ్లి ఎప్పుసు అనేది అనౌన్స్ చేయకపోయినా మార్చిలోనే వీరి వివాహం ఉంటుందని అన్నారు. కానీ మే వస్తున్నా పెళ్లి ఊసే లేకపోవడంతో మీడియాలో వీరి పెళ్లి కాన్సల్ అయ్యిందనే వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఫైనల్ గా ఈ వార్తలకు త్రిష దించేసింది. ‘పెళ్లి గురించి కొన్ని వందల వార్తలు వస్తున్నాయి.. ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. ప్రస్తుతం నేను సింగిల్ అండ్ హ్యాపీ’ అని త్రిష ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో ఎందుకు పెళ్లి ఆగిపోయిందో తెలియకపోయినా పెళ్లి ఆగిపోయింది అన్న విషయం పై మాత్రం ఈ వచ్చింది.

ఈ ఏడాది తమిళంలో ‘ఎన్నై అరింధాల్’ సినిమాతో తమిళంలో హిట్ అందుకున్న ఈ భామ త్వరలోనే తెలుగులో ‘లయన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతే కాకుండా పలు సినిమాలతో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు