
మాస్ మహారాజ్ రవితేజను డిఫరెంట్‌గా పరిచయం చేసి అతడి కెరీర్‌లో మరిచిపోలేని సినిమాగా నిలిచింది ‘కిక్’. ఇప్పుడా సినిమాకు సీక్వెల్‌గా ‘కిక్ 2’ రూపొందుతోన్న విషయం తెలిసిందే! ‘కిక్’ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డియే ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఈ సినిమాలో రవితేజ్ డ్యూయల్ రోల్‌లో నటించినట్లు తెలుస్తోంది. రవితేజ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘కిక్ 2’ ఆడియోను ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. హైద్రాబాద్‌లోని సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సాయంత్రం ఆడియో ఆవిష్కరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. థమన్ – రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న ఏడో ఆల్బమ్ కావడంతో ఈ ఆల్బమ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ నెలాఖర్లో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

