‘గంగ’ ఫస్ట్‌వీక్ బంపర్ కలెక్షన్స్..!

‘గంగ’ ఫస్ట్‌వీక్ బంపర్ కలెక్షన్స్..!

Published on May 9, 2015 3:00 PM IST

kanchana-2
హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా, ముని సిరీస్‌లో మూడో సినిమా ‘గంగ(ముని 3)’ తెరకెక్కింది. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని గత వారమే విడుదలైన ఈ సినిమా తెలుగు వర్షన్ కాసుల వర్షం కురిపిస్తోంది.

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగ’ సినిమాకు తెలుగులో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఔట్ అన్డ్ ఔట్ మాస్ సినిమాగా తెరకెక్కిన ‘గంగ’.. టార్గెట్ ఆడియన్స్‌ని అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా లభించడంతో మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా 14కోట్ల షేర్ సాధించి సూపర్‌హిట్‌గా నిలిచింది. పెద్దగా ప్రచారం కూడా లేని ఈ సినిమా తెలుగులో ఇంతటి వసూళ్ళను సాధించడం విశేషంగా కనిపిస్తోంది.

రాఘవ లారెన్స్, తాప్సీ, నిత్యా మీనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో వారి యాక్టింగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు