డాషింగ్ డైరెక్టర్ అన్న పేరుకి తగ్గట్టుగానే పూరి జగన్నాధ్ తన స్క్రిప్ట్ దశ నుంచి సినిమా రిలీజ్ వరకూ ఇలా అన్నిటిలోనూ దూకుడు స్వభావంతో సినిమాని ఫినిష్ చేసి, రిలీజ్ చేసేస్తాడు. అలా షూటింగ్ మొదలు పెట్టిన రెండు నెలల్లోనే పూరి షూటింగ్ పూర్తి చేసిన మరో సినిమా ‘జ్యోతి లక్ష్మీ’. ఇన్ని రోజులు ఎంతో మంది స్టార్ హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన పూరి జగన్నాధ్ మొదటి సారి ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ తో చార్మింగ్ గర్ల్ ఛార్మీ కి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టేలా ప్లాన్ చేసాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ జ్యోతి లక్ష్మీ ఫస్ట్ టీజర్ ని ఛార్మీ బర్త్ డే కానుకగా మే 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఛార్మీ తన అపార్ట్ కి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టింది, అలాగే మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఓ హార్డ్ హిట్టింగ్ పాయింట్ తో పూరి ఈ సినిమా తీసాడు. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. సికె ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.


