
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 31న లాంచ్ కానున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా ఆర్. రత్నవేలు పనిచేయనున్నారు. ఇదే విషయాన్ని రత్నవేలు కన్‌ఫర్మ్ చేసేశారు.
గతంలో ‘ఆర్య’, ‘జగడం’, ‘1 నేనొక్కడినే’ సినిమాలతో పాటు తమిళంలో మరెన్నో అద్భుతమైన సినిమాలతో విజువల్ ట్రీట్ ఇచ్చిన రత్నవేలు, మహేష్ బాబుతో రెండోసారి కలిసి పనిచేయడం పట్ల తన ఆనందాన్ని వెల్లిబుచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చనున్నారు.

