‘ప్రొడ్యూసర్స్ సిండికేట్’కి మోహన్ బాబు వార్నింగ్

‘ప్రొడ్యూసర్స్ సిండికేట్’కి మోహన్ బాబు వార్నింగ్

Published on May 24, 2015 5:30 PM IST

mohan-babu
గత కొంత కాలంగా టాలీవుడ్ లో పలువురు చిన్న నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న విషయం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఏర్పడిన ‘ప్రొడ్యూసర్స్ సిండికేట్’. ఈ విషయంపై ఇప్పటికే పలువురు నిర్మాతలు తన వ్యతిరేఖతని చూపారు. ఇటీవలే తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ప్రొడ్యూసర్స్ సిండికేట్ పై ధ్వజమెత్తారు. తాజాగా పద్మశ్రీ డా. మోహన్ బాబుకూడా తాజాగా ప్రొడ్యూసర్స్ సిండికేట్ పై ధ్వజమేత్తడమే కాకుండా చిన్న నిర్మాతలకు సపోర్ట్ గా నిలబడతా అన్నారు.

ప్రొడ్యూసర్స్ సిండికేట్ పై మోహన్ బాబు ఫైర్ అవ్వడమే కాకుండా వాళ్లకి వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతే కాకుండా ఫైనాన్సియర్స్ ఉన్న అమౌంట్ ని క్లియర్ చెయ్యకుండా తన స్వార్ధాన్ని చూసుకోవడం తప్పు అని త్వరలోనే వాళ్ళ ఆటలు కట్టిస్తాం. ఈ సమస్యల కోసం నేను చిన్న నిర్మాతలవైపు నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేస్తానని తెలిపాడు. అలాగే ఈ ప్రొడ్యూసర్స్ సిండికేట్ కి ఎవరూ మోనే కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఏ ఒక్కరినీ కాదా అలాగే ఏ ఒక్క గ్రూప్ ది కాదని మోహన్ బాబు తెలియజేశాడు. ఈ లెక్కన త్వరలోనే ఈ ప్రొడ్యూసర్స్ సిండికేట్ కి త్వరలోనే కళ్ళెం పడే అవకాశం ఉందని ఊహించవచ్చు.

తాజా వార్తలు