పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?

పెయిన్ కి ప్రిపేర్ చేస్తున్న ‘పెద్ది’ టీం!?

Published on May 2, 2026 7:04 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే పెద్ది. ఒక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ పీరియాడిక్ చిత్రం ఎట్టకేలకు ముందే రాబోతుంది అని మేకర్స్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా సాలిడ్ ఎమోషనల్ రైడ్ ని కూడా ఈ సినిమాతో కన్ఫర్మ్ చేయగా నిన్న వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ మాత్రం ఒక్కసారిగా అభిమానుల్ని కదిలించింది.

ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ లా కాకుండా ఇందులో పెద్ది పెయిన్ ని చూపిస్తున్నట్టు కనిపించింది. దీనితో ఈ పోస్టర్ తోనే సినిమాలో ఒక ఊహించని పెయిన్ ఫుల్ ఎపిసోడ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ సినిమాలో చరణ్ పై ఒక హార్డ్ హిట్టింగ్ ఎపిసోడ్ ఉందనే టాక్ ఉంది. మరి ఈ పోస్టర్ దానికి సంబంధించినదే అని కూడా చెప్పొచ్చు. మరి బుచ్చిబాబు ఎలాంటి ట్రీట్ ని ప్లాన్ చేసాడు అనేది ఈ జూన్ 4 వరకు ఆగితే తేలిపోతుంది.

తాజా వార్తలు